Header Banner

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం! ఏపీ, తెలంగాణ రెండు నాకు..

  Wed May 28, 2025 22:07        Politics

దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థంగా నడిపించేందుకు కృషి చేస్తానని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మహానాడులో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. "నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెదేపా ఉంటుంది. నా బలం, బలగం తెదేపా. నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మహానాడులో ఆరు శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయి. రాబోయే 40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నాం. నక్సలిజం రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ తెదేపా. రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు పరిచాం. రాయలసీమ రాళ్ల సీమ కాదు.. రత్నాల సీమగా మారుస్తానని చెప్పాం. కోనసీమ కంటే సంపదలో అనంతపురం ముందుండడానికి తెదేపా కారణం. హైదరాబాద్లో మత ఘర్షణలను పూర్తిగా కట్టడి చేశాం. తెదేపా అధికారంలో ఉంటే అందరికీ రక్షణ ఉంటుంది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. హంద్రీనీవా కింద చివరి భూములకు నీళ్ల కోసం రూ.3,800 కోట్లు ఖర్చు చేశాం. పోలవరం తర్వాత హంద్రీనీవాకు భారీగా ఖర్చు చేస్తున్నాం. వెలిగొండతో పాటు మిగతా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం" అని చంద్రబాబు అన్నారు.

 

ఇది కూడా చదవండి: పెట్రోల్‌ కాదు.. హైడ్రోజన్‌ కాదు.. ఎలక్ట్రిసిటీ అసలే కాదు.. భవిష్యత్తు ఇంధనమేంటో తెలుసా?

 

చంద్రబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు..

 

175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి.. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం

 

రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్గా మారుస్తాం

 

జాతీయ రహదారులకు రూ.1.2లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం

 

రాష్ట్రంలో 24వేల కిలోమీటర్ల మేర గ్రామాల్లో రోడ్లు వేశాం

 

రాబోయే రోజుల్లో ఉండేది ఒకే ఇజం.. అదే టూరిజం. పర్యాటకం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు

 

గండికోటలో ఏడాదిలో కృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటు చేస్తాం

 

తల్లికి వందనం ఇచ్చి ఆడబిడ్డల రుణం తీర్చుకుంటా

 

ఆగస్టు 15 నుంచి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం

 

వంట గ్యాస్ డబ్బులు నాలుగు నెలలకోసారి ఖాతాల్లో జమ

 

రూ.9వేల కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం. 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తాం

 

కడప స్టీల్ ప్లాంట్ ద్వారా 3వేల మందికి ఉపాధి అవకాశాలు

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations